ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్మశానంలో రైతు భరోసా కేంద్రం... అధికారులపై హైకోర్టు ఆగ్రహం

చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లి గ్రామ సచివాలయాన్ని శ్మశానంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. గ్రామ సచివాలయం వద్దన్న ఆ స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు...ధిక్కరణ నేరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

High court
High court

By

Published : Nov 9, 2020, 7:46 PM IST

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లి గ్రామంలో శ్మశానంలో అనుమతి లేకుండా గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. గ్రామ సచివాలయం నిర్మించవద్దన్న అదే స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

కోర్టు తీర్పును సైతం అపహాస్యం చేస్తారా అని అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 215 ప్రకారం అవసరమైతే సుమోటోగా కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకుంటామంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details