గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఫలితాలు వెల్లడించవద్దని ఏపీపీఎస్సీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 2018 డిసెంబర్లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. పరీక్ష సమయంలో క్యాలిక్యులేటర్లు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు క్యాలిక్యులేటర్‌ను అనుమతించలేదని, తెలుగు అనువాదంలో 75 తప్పులు దొర్లాయని పేర్కొంటూ 15 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియపై తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి... పరీక్ష ఫలితాలను నిలిపేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. మరోవైపు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ - 2 ఫలితాలను కూడా ప్రకటించవద్దని ధర్మాసనం తెలిపింది.
'గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించొద్దు' - గ్రూప్ -1 ఫలితాలపై హైకోర్టు స్టే
గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని పేర్కొంటూ... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
గ్రూప్ - 1ఫలితాలు