నిధుల వెనక్కి పిటిషన్ ఈ నెల 18 కి వాయిదా!
రూ. 350 కోట్లను కేంద్ర వెనక్కిి తీసుకుందనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నిధుల వెనక్కి గల కారణాలపై కేంద్రం తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని గడువు కోరినందువల్ల ఈ నెల 18 కి వాయిదా వేశారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బులను తిరిగి వెనక్కుతీసుకుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.350 కోట్ల నిధులను వెనక్కు తీసుకుందనే విషయం ఎలా తెలుసని కొణతాలను న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా... లేఖల ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు పిటిషనర్ సమాధానమిచ్చారు. నిధులను వెనక్కి తీసుకోవటానికి గల కారణాలేంటో తెలిపేందుకు మరికొంత గడువు కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.