ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘గంగవరం లో వాటా విక్రయంపై కౌంటర్లు దాఖలు చేయండి'

గంగవరం నౌకాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 10.40% వాటాను(షేర్లను) అదానీ పోర్ట్స్‌కు విక్రయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ మారిటైం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లెకు చెందిన డాక్టర్‌ సత్యభూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

హైకోర్టులో గంగవరం పోర్టు వాటాల విక్రయంపై విచారణ
హైకోర్టులో గంగవరం పోర్టు వాటాల విక్రయంపై విచారణ

By

Published : Sep 21, 2021, 5:48 AM IST

గంగవరం నౌకాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 10.40% వాటాను(షేర్లను) అదానీ పోర్ట్స్‌కు విక్రయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ మారిటైం బోర్డును హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు చేయించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కాగ్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లెకు చెందిన డాక్టర్‌ సత్యభూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్‌ ఎంఆర్‌ వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ... గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10% వాటాను ఏపీ మారిటైం బోర్డుకు మాత్రమే విక్రయించే అధికారం ఉందన్నారు. కాని ప్రభుత్వమే విక్రయించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, పాదదర్శకత పాటించకుండా, టెండర్లు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాను విక్రయించారన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంపై రికార్డులను కోర్టు ముందు ఉంచుతామన్నారు. మారిటైం బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ... గంగవరం పోర్టులో ఎక్కువ వాటా అదానీ పోర్ట్స్‌ సంస్థకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు.

ఇదీచదవండి.

ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details