విశాఖ ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించిన యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కంపెనీలో విషవాయవులు విడుదలై ప్రాణ నష్టం సంభవించినందున ఎల్జీ పాలిమర్స్ మూసివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీలోని యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతించిన హైకోర్టు... ఆ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తుదితీర్పు మేరకు నడుచుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.