ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్ వాహనాల రంగులపై.. తీర్పు రిజర్వ్​లో ఉంచిన హైకోర్టు

పలు పార్టీలు రేషన్ వాహనాల రంగులపై అభ్యంతరాలు తెలిపాయని ఎస్​ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వేసిన పిటిషన్​.. న్యాయస్థానంలో ఈరోజు విచారణకు వచ్చింది. తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది.

By

Published : Feb 10, 2021, 6:57 PM IST

Published : Feb 10, 2021, 6:57 PM IST

high court reserved decision on ration vehicle colours case
రేషన్ వాహనాల రంగులపై తీర్పు రిజర్వ్​లో ఉంచిన హైకోర్టు

రేషన్ వాహనాల రంగులపై ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను పరిశీలించి.. వాటి రంగులు మార్చాలని అధికారులకు తెలిపామని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.

వాహనాల రంగులపై పలు పార్టీలు ఫిర్యాదులు చేశాయన్నారు. వాటిపై ప్రస్తుతం వేరే రంగులు ఉన్నా.. వైకాపా జెండా రంగులే అధికంగా ఉన్నాయని చెప్పారు. పథకం నిలువరిస్తామని తాము చెప్పలేదని.. రంగులు మార్చితే అనుమతిస్తామని తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details