ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్క ఉత్తర్వూ అమలు కావడం లేదు: తెలంగాణ హైకోర్టు - హైదరాబాద్​ వార్తలు

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక్క ఉత్తర్వూ అమలు కావడం లేదు: హైకోర్టు
ఒక్క ఉత్తర్వూ అమలు కావడం లేదు: హైకోర్టు

By

Published : Jul 27, 2020, 3:08 PM IST

కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో చెప్పాలని ఆదేశించింది.

నిన్నటి బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏం చేయమంటూరో రేపు సీఎస్‌నే అడుగుతామని పేర్కొంటూ.. కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనాలో కరోనా బులెటిన్‌ వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details