ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tollywood Drugs Case: ముగిసిన హీరో రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్​ విచారణ - డ్రైవర్ శ్రీనివాస్​

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు..ఇవాళ నటుడు రవితేజ (HERO RAVI TEJA)తో పాటు అతడి డ్రైవర్‌ శ్రీనివాస్​ను ఈడీ అధికారులు విచారించారు.

ముగిసిన హీరో రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్​ విచారణ
ముగిసిన హీరో రవితేజ, డ్రైవర్‌ శ్రీనివాస్​ విచారణ

By

Published : Sep 9, 2021, 4:58 PM IST

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నోటీసులు జారీ చేసిన ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడంతో పాటు.. ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)​ను కలిపి విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెల్విన్​ వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ నటుడు రవితేజ(HERO RAVI TEJA)తో పాటు అతడి డ్రైవర్‌ శ్రీనివాస్​ను ఈడీ అధికారులు విచారించారు.

డ్రగ్స్ కేసు, మనీలాండరింగ్ వ్యవహారంపై రవితేజను దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రవితేజ డ్రైవర్​ శ్రీనివాస్​ను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రవితేజ డ్రైవర్‌పై తీవ్ర ఆరోపణలు రావడం వల్ల.. ప్రస్తుతం ఈడీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. కెల్విన్‌ నుంచి డ్రైవర్ శ్రీనివాస్​కు మాదకద్రవ్యాలు సరఫరా అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే దానిపై లోతుగా విచారించినట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details