యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు.. క్లారిటీ ఇచ్చిన నేవీ..! - helicopter collpsed at Vishakhapatnam latest news
13:54 August 27
విశాఖ యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు
విశాఖపట్నం యారాడలో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని నేవీ స్పష్టం చేసింది. కొత్తగా 3 హెచ్‌ఏఎల్ హెలికాప్టర్లు తూర్పు నౌకాదళానికి వచ్చాయని.. యారాడ నౌకాదళం ప్రాంతంలో శిక్షణా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించింది. ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందని స్పష్టం చేసింది.
యారాడ వద్ద ఓ హెలికాప్టర్ గాల్లో చాలా సేపు చక్కర్లు కొట్టింది. యారాడ దర్గాకు అత్యంత సమీపంలో దాదాపు 40 నిమిషాలపాటు చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం నేవీ బేస్ వద్ద ముళ్ల పొదల్లో కూలిపోయి ఉంటుందని ప్రచారం జరిగింది. హెలికాప్టర్ యారాడ దర్గా సమీపంలో అతి తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టడంతో అక్కడ ఉన్న కొన్ని చెట్లు నాశనమయ్యాయి. ఎక్కువ సమయం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి: