ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hyderabad rains: తడిసిముద్దైన భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ నగరంలో జోరు వాన(hyderabad rains) కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. మేయర్(ghmc mayor) గద్వాల విజయలక్ష్మి పలు ప్రాంతాల్లో పర్యటించారు. సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

heavy rains in hyderabad
తడిసిముద్దైన భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Jul 13, 2021, 10:26 PM IST

తడిసిముద్దైన భాగ్యనగరం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ తడిసిముద్దవుతోంది. ఇవాళ ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు(hyderabad rains) కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చిరుజల్లులతో మొదలై... మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరుగా కురుస్తోంది.

వానలే వానలు

నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో జోరు వాన కురిసింది. పటాన్‌చెరు, మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, నాంపల్లి సహా నగరంలో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది.

జలమయం

వికారాబాద్ జిల్లా తాండూరులో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేని వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీల్లో వరద నీరు ప్రవహించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని.. రాష్ట్రంలో(rains in telangana) మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తగు చర్యలు తీసుకోవాలి

ఈ నేపథ్యంలో మేయర్(ghmc mayor) గద్వాల విజయలక్ష్మి(vijayalakshmi) పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎల్బీనగర్ జోన్‌ నాగోల్ వార్డు పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్... క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. అధికారులు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగోల్‌ అయ్యప్పకాలనీ, శ్రీ మహాలక్ష్మి వాంబే కాలనీలో మేయర్ పర్యటించారు. బాక్స్‌ డ్రైన్‌ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

సమీక్ష

ఆదర్శనగర్‌ కాలనీ ట్రంక్‌ లైన్‌ పనులను పరిశీలించారు. కాలనీవాసుల సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎల్‌బీనగర్ జోనల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష(review on problems) నిర్వహించారు. మరో రెండు, మూడు రోజులు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ఏదైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ(ghmc) కంట్రోల్ రూమ్ 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.

ఇవీ చదవండి:

Water War: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల

ABOUT THE AUTHOR

...view details