ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rain Effect in Siricilla : సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద.. స్తంభించిన జనజీవనం

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల(Rain Effect in Sircilla) జిల్లా వ్యాప్తంగా.. ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. భారీ వానకు జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగుతున్నాయి. సిరిసిల్ల పట్టణమంతా జలమయం అయింది. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. సహాయక చర్యల కోసం కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

heavy rain in rajanna sircilla district
సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద.. స్తంభించిన జనజీవనం

By

Published : Sep 7, 2021, 1:30 PM IST

సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద

నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rain Effect in Siricilla)లో రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొత్తచెరువు మత్తడి దూకడం వల్ల సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలోని దుకాణాళ్లోకి నీరు చేరింది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం 9398684240 ఫోన్ నెంబర్​ను సంప్రదించాలని పేర్కొన్నారు.

సిరిసిల్ల(Rain Effect in Siricilla)లో ఎడతెరిపిలేని వర్షం.. పట్టణాన్ని ముంచెత్తింది. వరద నీటితో పలు కాలనీలు జలమయం అయ్యాయి.. పాతబస్టాండ్‌ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. ప్రగతినగర్, సాయినగర్‌... అంబికానగర్‌, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి.. వరద నీరు చేరింది. కొత్తకలెక్టరేట్ ప్రాంగణంలోనూ భారీ వర్షపు నీరు చేరింది. సిరిసిల్లలో విద్యాసంస్థలకు.. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సెలవు ప్రకటించారు. సహాయకచర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :

Rainfall Warning: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణకి అత్యంత భారీ వర్షసూచన

ABOUT THE AUTHOR

...view details