ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP HC: నిబంధనలు లేకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

నిబంధనలు లేకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలు ఎలా నిర్వహిస్తారంటూ హైకోర్టు ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డును ప్రశ్నించింది.ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ.. ఇది ఐదున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమన్నారు. విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

HC On Inter Online
HC On Inter Online

By

Published : Aug 20, 2021, 9:40 AM IST

చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించకుండా ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్‌ ప్రవేశాలను ఎలా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంటర్‌ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది ప్రవేశాల విషయంలోనూ ఇదే వ్యవహారాన్ని తాము తప్పుబట్టినట్లు గుర్తు చేసింది. ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ.. ఇది ఐదున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమన్నారు. పూర్తి వివరాల్ని కోర్టు ముందుంచుతూ అఫిడవిట్‌ దాఖలుకు స్వల్ప వ్యవధి కావాలని కోరారు.

అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్‌ ప్రవేశాలు చేపట్టే నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గతేడాదిలాగే అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.

ఇదీ చదవండి: varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి

ABOUT THE AUTHOR

...view details