ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హాల్​మార్క్'​పై హైకోర్టులో విచారణ.. వివరాలివ్వాలని కేంద్రానికి ఆదేశం

By

Published : Aug 25, 2021, 7:48 AM IST

బంగారు ఆభరణాలపై హాల్​మర్క్​ను ముద్రించే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ పిటిషనర్ కోరారు.

hc on gold hallmark
hc on gold hallmark

బంగారు ఆభరణాలపై హాల్ మార్క్​ను ముద్రించడం తప్పనిసరిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ బులియన్ బంగారు, వెండి, డైమండ్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు కె.విజయ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details