గ్రూప్ -1 ప్రధాన పరీక్ష విధానం డిజిటల్ మూల్యాంకన పద్ధతులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ పి. ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేశారు. తన ఆమోదం లేకుండా పరిపాలనాపరమైన విధులు నిర్వహించారని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీకి ఛైర్మన్‌గా ఉన్న తనను స్వతంత్రంగా వ్యవహరించేందుకు అనుమతించలేదన్నారు. తాను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా 2015 నవంబర్ 27 న నియమితులైనట్లు అఫిటవిట్లో పేర్కొన్న ఉదయభాస్కర్.. ఈ ఏడాది నవంబర్ 26తో పదవీకాలం ముగుస్తుందని తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి తన విధుల్లో జోక్యం చేసుకోకుండా, కార్యాలయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవమేన్నారు. తన అధికారిక విధులకు అవరోధం కలిగించొద్దని కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలిచ్చిన్పటికీ…తాను నిర్వహించే అధికారిక విధులన్నింటిలో సాధ్యమైన అన్ని మార్గాల నుంచి అడ్డంకులు కలిగించారని.. అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
APPSC: కోర్టు చెప్పినా వినలేదు..విధులకు అడ్డంకులు సృష్టించారు: ఉదయభాస్కర్ - ఏపీపీఎస్సీ వార్తలు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఉదయభాస్కర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తన ఆమోదం లేకుండా పరిపాలనాపరమైన విధులు నిర్వహించారని తెలిపారు . రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీకి ఛైర్మన్‌గా ఉన్న తనను స్వతంత్రంగా వ్యవహరించేందుకు అనుమతించలేదన్నారు.
కార్యదర్శి, అదనపు కార్యదర్శికి అధికారిక విజ్ఞప్తి చేసినప్పటికీ తాను చట్టబద్ధంగా పొందే అటెండర్, పేషీ సిబ్బందిని నిరాకరించారన్నారు. జనవరి 2020 నుంచి కమిషన్‌కు సంబంధించిన ఏ విధమైన అధికారిక సమావేశానికి తనను ఆహ్వానించలేదన్నారు. ఈ తరహా చర్య నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. గ్రూప్-1 పరీక్షతో పాటు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సమావేశాలకు ఛైర్మన్ లేకుంటే అనుమతించిన సీనియర్ సభ్యుడు కాని సారథ్యం వహించలేదన్నారు. నిబంధనలను సవరిస్తూ 2020 ఫిబ్రవరి 25 న నిర్వహించిన సమావేశానికి చట్టబద్ధ విలువ లేదని పేర్కొన్నారు. డిజిటల్ మూల్యాంకన అంశాల్ని చర్చించేందుకు 2019 నవంబర్ 14, 15 తేదీల్లో వర్క్ షాప్‌నకు ఏర్పాట్లు చేశారన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేస్తూ 17 లక్షల 25 వేల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని తెలిపారు. ఛైర్మన్ అనుమతి లేకుండా కార్యదర్శి ఆ వర్క్ షాప్‌ను రద్దు చేశారని ఉదయ్ భాస్కర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:jagan cbi case: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని.. సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్