పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ గుంటూరుకు చెందిన దూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్వీకరించలేదు. ఈ పిటిషన్ను రేపు విచారించే అవకాశం ఉంది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్తే 3.60 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇప్పటి నోటిఫికేషన్ నిలిపివేసి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని పిటిషన్లో ప్రస్తావించారు.
పంచాయతీ ఎన్నికలపై హౌస్ మోషన్ పిటిషన్.. రేపు విచారణ!
పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ap local polls 2021