ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LIVE UPDATES: తీరం దాటిన 'గులాబ్' తుపాను

1
1

By

Published : Sep 26, 2021, 4:46 PM IST

Updated : Sep 27, 2021, 12:23 AM IST

00:21 September 27

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను తీరం దాటింది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

  • శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను తీరం దాటింది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ 
  • సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య తుపాను తీరం దాటింది: కలెక్టర్
  • ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎక్కువ నష్టం జరగలేదు: కలెక్టర్
  • నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి: కలెక్టర్ 
  • పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ 
  • శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది: కలెక్టర్ 
  • అన్ని శాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
  • జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి: కలెక్టర్ 
  • ఆరుగురు మత్స్యకారుల్లో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు: కలెక్టర్ 
  • మత్స్యకారులు వజ్రపుకొత్తూరు మం. మంచినీళ్లపేట వాసులు: కలెక్టర్ 
  • ఒక మత్స్యకారుడి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది: కలెక్టర్ 
  • 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ 
  • 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ 
  • ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు తెలపాలి: కలెక్టర్
  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557: కలెక్టర్ 
  • జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933: కలెక్టర్
  • తుపాను కారణంగా జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్ 

23:52 September 26

తీరం దాటిన గులాబ్‌ తుపాను

  • తీరం దాటిన గులాబ్‌ తుపాను
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటిన గులాబ్‌ తుపాను
  • మరో 5గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనున్న గులాబ్‌ తుపాను

23:02 September 26

మరో 5 గంటల్లో పూర్తిగా బలహీనపడనున్న గులాబ్‌ తుపాను

  • మరో 5 గంటల్లో పూర్తిగా బలహీనపడనున్న గులాబ్‌ తుపాను
  • మరింత బలహీనపడి వాయుగుండంగా మారనున్న తుపాను

22:33 September 26

తుపాను ప్రభావం, సహాయ చర్యలపై కలెక్టర్‌తో సీఎస్‌ సమీక్ష

  • విశాఖ చేరుకున్న సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్
  • తుపాను ప్రభావం, సహాయ చర్యలపై కలెక్టర్‌తో సమీక్ష
  • విశాఖ కలెక్టర్‌, జేసీ, జీవీఎంసీ కమిషనర్‌, ఎస్పీతో సమీక్ష
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఆరా
  • తుపాను తీవ్రత పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌
  • విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన సీఎస్‌
  • తుపాను సహాయ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎస్
  • రేపు ఉదయం శ్రీకాకుళం వెళ్లి సమీక్ష చేయనున్న సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌
  • అనంతరం విజయనగరం వచ్చి తుపానుపై సమీక్ష చేయనున్న సీఎస్

21:27 September 26

కళింగపట్నానికి ఉత్తరాన 20 కి.మీ. దూరంలో తీరం తాకిన‌ తుపాను

  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం తాకిన గులాబ్ తుపాను
  • కళింగపట్నానికి ఉత్తరాన 20 కి.మీ. దూరంలో తీరం తాకిన‌ తుపాను

21:22 September 26

శ్రీకాకుళం జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు

  • శ్రీకాకుళం: 13 మండలాల్లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్‌ శ్రీకేష్
  • ఇప్పటివరకు 1,358 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు: కలెక్టర్‌
  • తుపాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షం, ఈదురుగాలులు
  • విశాఖ నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

21:05 September 26

తుపాను ప్రభావం..విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్షాలు

  • తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్షాలు
  • జిల్లాలో రాత్రి 8.30 వరకు 31.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదు
  • విజయనగరంలో అత్యధికంగా 67 మి.మీ. వర్షపాతం నమోదు
  • గజపతినగరంలో అత్యధికంగా 59 మి.మీ. వర్షపాతం నమోదు
  • నెల్లిమర్లలో అత్యధికంగా 51 మి.మీ. వర్షపాతం నమోదు
  • పార్వతీపురంలో అత్యధికంగా 46 మి.మీ. వర్షపాతం నమోదు
  • బొండపల్లిలో అత్యధికంగా 44 మి.మీ. వర్షపాతం నమోదు

20:54 September 26

  • విజయనగరం జిల్లాలో భారీ వర్షం, ఉద్ధృతంగా గాలులు
  • విజయనగరం జిల్లాలో పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

19:59 September 26

తీరం తాకిన గులాబ్ తుపాను

  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం తాకిన గులాబ్ తుపాను
  • కళింగపట్నానికి ఉత్తరాన 25 కి.మీ. దూరంలో తీరం తాకిన‌ తుపాను
  • తుపాను పూర్తిగా తీరం దాటేందుకు 3 గంటల సమయం
  • కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతున్న తుపాను
  • ఉత్తరాంధ్ర తీరం వెంబడి 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • ప్రజలు ఇళ్లు, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి: విపత్తులశాఖ కమిషనర్‌
     

19:46 September 26

  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాయగడలో రైల్వే హెల్ప్‌ డెస్క్‌లు
  • రైళ్ల రాకపోకల సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు: రైల్వే
  • శ్రీకాకుళం జిల్లా సముద్రతీర ప్రాంతాల్లో జోరు గాలులు
  • పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

19:41 September 26

  • శ్రీకాకుళం జిల్లాలో తుపానులో చిక్కుకుని ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
  • వజ్రపుకొత్తూరు మం. మంచినీళ్లపేటకు చెందిన నాయకన్న, మోహనరావు గల్లంతు
  • కొత్త బోటు కొనేందుకు ఒడిశా వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు
  • ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా తుపానులో చిక్కుకున్న బోటు
  • సురక్షితంగా అక్కుపల్లి తీరానికి చేరిన నలుగురు మత్స్యకారులు

18:53 September 26

  • గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభం
  • తీరం తాకే ప్రక్రియ మరో 3 గంటల్లో పూర్తి: భారత వాతావరణ శాఖ
  • ప్రస్తుతం కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను
  • ప్రస్తుతం తీరప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • గాలుల వేగం క్రమంగా 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం

18:45 September 26

  • విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నేటి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 20.2 మీ.మీ . సరాసరి వర్ష పాతం నమోదు 
     
  • పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ .. పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీ.ల సరాసరి వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడి.
  • ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వేపాడలో 7 మీ.మీ., రామ భద్ర పురంలో 5.6 మీ.మీ., కొత్తవలసలో 5.2 మీ.మీ. వర్షం
     
  • తుఫాన్ ఆదివారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో 80 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ల విడిచి బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో నివసించాలని అధికారులు ప్రజలకి సూచన
  • గులాబ్​ తుపాను హెచ్చరికతో ఆందోళన చెందుతున్న తీర ప్రాంత ప్రజలు
  • అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్న ఇచ్చాపురం నియోజకవర్గంలోని 27 గ్రామాల మత్స్యకారులు
  • బారువ, పొగరు వద్ద సుమారు 100 బోట్లను లంగరు వేసి ఉంచుకున్నామని వెల్లడి
  • వరద వస్తే బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన
  • కోట్ల రూపాయల విలువైన వలలు, బోట్లును సంరక్షించాలని అధికారులకు విన్నపం

18:20 September 26

  • శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో వీస్తున్న గాలులు
  • అధికార యంత్రాంగం అప్రమత్తం ఉండాలి: కలెక్టర్ శ్రీకేశ్​ లాఠకర్
  • వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
  • 73 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన అధికారులు
  • కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557
  • ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933

17:27 September 26

  • తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర విపత్తుల శాఖ
  • విశాఖ కలెక్టరేట్‌లో రాష్ట్ర విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష
  • విద్యుత్‌, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసుశాఖ సిద్ధంగా ఉండాలి: కన్నబాబు
  • జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, మత్య శాఖ సిద్ధంగా ఉండాలి: కన్నబాబు
  • తీర ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి: కన్నబాబు
  • సమాచార పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వాడుకోవాలి: కన్నబాబు
  1. మత్యకారులు సముద్రం లోకి వెళ్లకుండా నివారించాలి.
  2. సముద్రం లోని బోట్లను వెంటనే తీరానికి రమ్మని హెచ్చరించాలి.
  3. వివిధ శాఖలు ఎస్.ఒ.పి లను ఫాలో కావాలి.
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పలాస మధ్య తుపాను తీరం దాటే అవకాశం
  • దేవునల్తాడ, భావనపాడు, మూలపేట వద్ద తుపాను తీరం దాటే అవకాశం
  • వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి ప్రజలు అప్రమత్తం కావాలి: మంత్రి సీదిరి

17:04 September 26

Gulab Cyclone

  • గులాబ్ తుపాను 19 కి.మీ. వేగంతో కదులుతోంది: తుపాను హెచ్చరికల కేంద్రం
  • గోపాల్‌పూర్‌కు 110, కళింగపట్నానికి 130 కి.మీ. దూరంలో తుపాను

16:12 September 26

Gulab Cyclone Live page

  • తూర్పుమధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను
  • వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను
  • గోపాల్‌పూర్‌కు 140, కళింగపట్నానికి 190 కి.మీ. దూరంలో తుపాను
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనున్న గులాబ్ తుపాను
  • అర్ధరాత్రి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం
  • ఉత్తరాంధ్ర తీరం వెంట 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • ఉభయగోదావరి, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, విదర్భకూ భారీ వర్ష సూచన
Last Updated : Sep 27, 2021, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details