గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను సురక్షితంగా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అశ్విన్‌కుమార్ చెప్పారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం విజయ్‌రూపాని ఆదేశించినట్లు వివరించారు. చేపల వేటకు అనుమతించామని... మత్స్యకారులు రోజూవారీ పనులు చేసుకుంటూ నిశ్చింతగా ఉండవచ్చని భరోసా ఇచ్చారు.
ఏపీ మత్స్యకారులను జాగ్రత్తగా చూసుకుంటాం: గుజరాత్ సీఎంవో
గుజరాత్లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను జాగ్రత్తగా చూసుకుంటామని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి అశ్విన్‌కుమార్ చెప్పారు. వారికి వసతి భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
గుజరాత్ సీఎంవో
ఈ రోజు ఉదయం.. మత్స్యకారుల అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తికి స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అశ్విన్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: గుజరాత్ ముఖ్యమంత్రికి జగన్ ఫోన్