ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఇంటర్‌ సెకండియర్ ఫలితాలకు మార్గదర్శకాలివే - Guidelines for TS Inter second year results are finalize

తెలంగాణాలో ఇంటర్​ మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు(marks) ఇవ్వనున్నట్లు తెలిపింది.

Inter‌ second year results
ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలు

By

Published : Jun 23, 2021, 4:02 PM IST

Updated : Jun 23, 2021, 4:08 PM IST

తెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు (Inter second year results) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం(TS government) మార్గదర్శకాలు(guidelines) ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు(marks) ఇవ్వనున్నట్లు తెలిపింది.

గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు(interboard) కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఇవే..

Last Updated : Jun 23, 2021, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details