ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన జీఎస్‌టీ ఆదాయం - కేంద్ర ఆర్థికశాఖ

దేశవ్యాప్తంగా ఎనిమిదోసారి లక్ష కోట్లకుపైగా రాబడి వచ్చింది. జులైలో జీఎస్‌టీ ఆదాయ లెక్కలను కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసింది. గతేడాది కంటే 33% అధికమని తెలిపింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం ... తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించింది.

GST revenue has increased in Telugu states
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన జీఎస్‌టీ ఆదాయం

By

Published : Aug 2, 2021, 11:08 AM IST

గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం జులైలో తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసిన జులై లెక్కల ప్రకారం.. ఆ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,730 కోట్లు, తెలంగాణకు రూ.3,610 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీకి గతేడాది జులైలో రూ.2,130 కోట్లు రాగా ఈసారి అది 28% వృద్ధి చెందింది. తెలంగాణకు క్రితం సారి రూ.2,876 కోట్లు రాగా ఈసారి అది 26% పెరిగింది. లక్షద్వీప్‌, పుదుచ్చేరిలు మినహా గతనెలలో అన్ని రాష్ట్రాలూ పాజిటివ్‌ వృద్ధిరేటు నమోదు చేశాయి.

గతేడాది జులైలో రాష్ట్రాలకు రూ.66,291 కోట్ల జీఎస్‌టీ ఆదాయం రాగా ఈసారి 32% పెరిగి రూ.87,678 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి జులైలో రూ.1,16,393 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది కంటే 33% అధికమని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇలా లక్ష కోట్లకుపైగా పన్ను వసూలు కావడం వరుసగా ఇది 8వ సారి.

ABOUT THE AUTHOR

...view details