జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై 2019లో గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్లో గాంధీకి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు జరిపి పలు ఆధారాలు సేకరించారు.
తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి అరెస్టు - జగన్ అక్రమాస్తుల కేసు
తెలంగాణలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి బి.ఎస్.గాంధీని సీబీఐ అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్గా బీఎస్ గాంధీ ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారి గాంధీ అరెస్టు
నిన్న సాయంత్రం గాంధీని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు. బీఎస్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. జగన్తో ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి ఆస్తుల జప్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు.