'ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల' - mlc notification
రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల స్థానాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇందకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుది గడువు, మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అనంతరం 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.