తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజినీర్లతో ఛైర్మన్(GRMB Chairman) చంద్రశేఖర్ అయ్యర్(chandraShekhar iyer) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సారెస్పీ(SRSP) ప్రాజెక్టు విశేషాలు, పనితీరును అధికారుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సరస్వతి, లక్ష్మి కాలువలు, చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని పరిశీలించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ (GRMB chairman chandra Shekar iyer) నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూర్ జలాశయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల..... గరిష్ఠ వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయిలో విజిటింగ్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ (Chairman Chandrasekhar Iyer) ప్రాజెక్టుల పరిశీలన కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో బోర్డు సభ్యుడు కుటియాల్, ఇంజినీర్లతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ... గోదావరిలో రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఎంత మేర వినియోగిస్తున్నారనే అంశంతో పాటు ప్రాజెక్టుల పని తీరును తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar projects), అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ (srsp)ని పరిశీలించారు.
అందుకే పర్యటన
కేంద్రం ఇటీవల ఖరారు చేసిన పరిధికి అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు(River management boards) స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. పర్యటన అనంతరం ప్రాజెక్టుల స్వాధీనం విషయమై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈనెల 17న జీఆర్ఎంబీ సమావేశంకేంద్ర గెజిట్ అమలు(central gazette)కు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(Godavari river management board)) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని (GRMB Subcommittee Meeting) ఏర్పాటు చేసింది. గెజిట్ షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో హైదరాబాద్‌లోని జలసౌధలో గెజిట్ అమలుపై ఉ.11 గంటలకు ఉపసంఘం (GRMB Subcommittee Meeting) భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకునేందుకు ఎజెండా రూపొందించారు.