Sajjala On OTS issue: ఓటీఎస్‌తో పేదలకు నష్టం ఏమీ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ ప్రక్రియతో ఇళ్ల క్రయ విక్రయాలతో పాటు వారసులకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ రుసుంతో రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చేది రూ. 4 వేల కోట్లేనని వెల్లడించారు. పంచాయతీలో రూ. 10వేలు, పురపాలికలో రూ. 15వేలు రుసుం విధిస్తున్నామన్నారు. నగర పాలకసంస్థ పరిధి ఇళ్లకు రూ. 20వేల రుసుం ఉందని వివరిచారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని.. ఎవరినీ బలవంతం చేయడం లేదని వ్యాఖ్యానించారు.
కోపం ఉండదు..
Sajjala On Employees Protest: ఉద్యోగ సంఘాల నిరసనలపై సజ్జల స్పందించారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుందని.. కోపం ఉండదన్నారు. ముఖ్యమంత్రి జగన్ హామీ మేకు నిర్ణీత గడువులోగా పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు కాస్త సంయమనం పాటించాలని కోరారు.
'ఓటీఎస్‌తో పేదలకు నష్టం ఏమీ లేదు. ఇళ్ల క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది. వారసులకు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఓటీఎస్‌తో ప్రభుత్వానికి వచ్చేది రూ.4 వేల కోట్లే. తక్కువ రుసుముతో రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నాం'- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, కూల్చగలరనే వ్యాఖ్యలకు అర్థంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.