ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా కృషి చేస్తానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. శనివారం పూరీలో జగన్నాథున్ని దర్శించుకున్నట్లు తెలిపారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఒడిశా వచ్చినట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం వివాదంపై రాజ్యాంగ నిబంధనలకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ స్పష్టం చేశారు.
ఆంధ్ర, ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తా: గవర్నర్ - bishwabhushan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన స్వరాష్ట్రం ఒడిశాలో పర్యటిస్తున్నారు. పూరీ జగన్నాథ్, భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆంధ్రా-ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్ర, ఒడిశా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తా: గవర్నర్