MUNICIPAL SCHOOLS: రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ పాఠశాలల బాధ్యతను.. పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 123 పుర, నగరపాలక సంస్థల్లో కేవలం 59 మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,942 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మున్సిపల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్పుతో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలనే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మున్సిపల్ పాఠశాలల ఆస్తులు మున్సిపల్ శాఖ అధీనంలోనే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
MUNICIPAL SCHOOLS: మున్సిపల్ పాఠశాలల బాధ్యత.. విద్యాశాఖకు అప్పగింత - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
MUNICIPAL SCHOOLS: రాష్ట్రంలోని 2,114 మున్సిపల్ స్కూల్స్ బాధ్యతను.. పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
MUNICIPAL SCHOOLS
TAGGED:
government latest news