మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. 10 మందికి మించకుండా ఆలం నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ఊరేగింపులో 30 నుంచి 40 మందికే అనుమతి ఉంటుందని తెలిపింది.
మొహర్రం.. ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలు విడుదల - మొహర్రం
మొహర్రానికి ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆలం నిర్వహించేటప్పుడు పది మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది.
మొహర్రం
మంచినీటి సీసాలు మినహా ఇతరత్రా వితరణకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:కొవిడ్ థర్డ్ వేవ్ నివారణలోనూ మీ వంతు బాధ్యత నిర్వర్తించండి: గవర్నర్