ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

Telangana RTC News: తిరుమల వచ్చే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రం నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Telangana RTC
Telangana RTC

By

Published : Jun 5, 2022, 12:10 PM IST

Telangana RTC News: తెలంగాణ నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్లు జారీ చేసేందుకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందాలనుకున్న వారు ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక నుంచి 25 కేంద్రాల ద్వారా కార్గో సేవలు..

పార్శిల్‌ సేవలను విస్తరించే క్రమంలో హైదరాబాద్‌లోని 25 ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా పికప్‌ చేసుకోవచ్చు అని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిల్స్‌ను ప్రస్తుతం జూబ్లీ బస్టేషన్‌, ఎంజీబీఎస్‌ నుంచి తీసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి ఏ ప్రాంతంలో పార్శిల్‌ను తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి బుక్‌ చేసుకునే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జెఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ ఏసీ బస్టాప్‌, రైతుబజార్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చర్లపల్లి, మేడిపల్లి, హకీంపేట, కుషాయిగూడ, మేడ్చల్‌, జేబీఎస్‌, రాణిగంజ్‌, మానిక్‌చంద్‌ పాయింట్‌, ముషీరాబాద్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, కోఠి, సీబీఎస్‌, కాచిగూడ, ఆటోనగర్‌, హయత్‌నగర్‌లలో ఎక్కడి నుంచైనా పార్శిల్స్‌ తీసుకోవచ్చు. కోరుకున్న ప్రాంతంలో తీసుకోవాలనుకుంటే పార్శిల్‌ ఛార్జీలపై పది కిలోల లోపైతే అదనంగా రూ.30, పది కిలోలు దాటితే రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details