గులాబ్ తుపాను ప్రభావంతో (cyclone gulab effect) తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో సోమవారం భారీ వానలు (heavy rains in hyderabad) కురిశాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన(Heavy Rain in Telangana) పడుతూనే ఉంది. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.
హైదరాబాద్‌లో హై అలర్ట్..
హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్ (himayat sagar), ఉస్మాన్‌సాగర్ (osman sagar) గేట్ల ఎత్తివేతతో మూసీకి వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. ఫలితంగా మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. చాదర్‌ఘాట్ వద్ద వంతెనను ఆనుకుని మూసీ వరద ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపేశారు. కోఠి-చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వరద వస్తుండడం వల్ల చాదర్‌ఘాట్ వంతెనపై పోలీసుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ (high alert in hyderabad) ప్రకటించారు. పీర్జాదిగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. జియాగూడ వద్ద మూసీ నది (heavy water inflow to musi river)ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
రోడ్లపై మోకాల్లోతు నీరు..