ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరంలో భూగర్భ శాస్త్రవేత్తల పర్యటన - polavaram news

పోలవరం ప్రాజెక్టు పనులను భూగర్భ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. పవర్‌హౌస్‌ పునాదుల్లోని రాళ్లను, జంట సొరంగాలను చూశారు.

polavaram
polavaram

By

Published : Jul 14, 2020, 8:44 AM IST

పోలవరం ప్రాజెక్టు పనులను భూగర్భ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దక్షిణాది రాష్ట్రాల డైరెక్టర్‌ బి.అజయ్‌ కుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డీకే భూషణ్‌ తూర్పుగోదావరి జిల్లా పరిధి పవర్‌హౌస్‌ పునాదుల్లోని రాళ్లను, జంట సొరంగాలను చూశారు. తర్వాత పశ్చిమవైపు జరుగుతున్న గ్యాప్‌-1, 2, 3 పునాదులను, స్పిల్‌వే పక్కన ఉన్న కొండను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట జల వనరులశాఖ డీఈలు శ్రీనివాసరావు, ఎన్‌.రామేశ్వర నాయుడు, ఎండీకే ప్రసాద్‌, ఏఈ ఎం.వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

ABOUT THE AUTHOR

...view details