Padma Awards 2022 : పద్మ పురస్కారాలు అందుకున్న గరికపాటి, వెంకట ఆదినారాయణరావు - andhra pradesh padma awards
Padma Awards 2022 : రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు, ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావులు పురస్కారాలను స్వీకరించారు. తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర వాద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య అందుకున్నారు.
పద్మ పురస్కారాలు అందుకున్న గరికపాటి, వెంకట ఆదినారాయణరావు
By
Published : Mar 22, 2022, 11:18 AM IST
Padma Awards 2022 : రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
పద్మాలంకృతులైన వేళ..
Padma Awards 2022 For Telangana : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు పురస్కారాలను స్వీకరించారు. తెలంగాణకు సంబంధించి 12 మెట్ల కిన్నెర వాద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్ హిలమ్ షా ఉద్దీన్ అందుకున్నారు.