తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో కొందరు వ్యక్తులు రోజా ట్రేడర్స్ పేరిట ఘరానా మోసానికి తెరలేపారు. 40 శాతం డిస్కౌంట్ అంటూ, ఆర్డర్‌పై సప్లై చేస్తామంటూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. తమిళనాడుకు చెందిన కొందరు రోజా ట్రేడర్స్ పేరుతో ఓ షాపు ఓపెన్ చేశారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోంనీడ్స్, మొబైల్స్‌పై డిస్కౌంట్ పేరుతో జనాల వద్ద డబ్బులు వసూలు చేశారు. ఆర్డర్ చేసిన 10 రోజులకు డెలివరీ చేస్తామని నమ్మబలికారు. కొత్తలో కొందరికి వస్తువులు ఇచ్చి మరి కొందరిని ఆకర్షించి డబ్బులు వసూలు చేశారు.
40శాతం డిస్కౌంట్ అన్నారు.. నిండా ముంచేశారు.. - vikarabad district
తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి తెరలేపారు. 40 శాతం డిస్కౌంట్‌తో ఆర్డర్‌పై వస్తువులు సప్లై చేస్తామంటూ డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
![40శాతం డిస్కౌంట్ అన్నారు.. నిండా ముంచేశారు.. fraud-in-the-name-of-roja-traders-in-vikarabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5257822-567-5257822-1575380161244.jpg)
40శాతం డిస్కౌంట్ అన్నారు.. నిండా ముంచేశారు..
40శాతం డిస్కౌంట్ అన్నారు.. నిండా ముంచేశారు..