వరంగల్ పట్టణ జిల్లా గొర్రెకుంట శివారులోని ఓ గోదాం బావిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి, మరో పాప మృతదేహాలను బావిలో గుర్తించారు.
తెలంగాణ: బావిలో పడి నలుగురు అనుమానాస్పద మృతి - బావిలో పడి నలుగురు వలస కార్మికులు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో నలుగురు మృతదేహాలు కలకలం సృష్టించాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
బావిలో పడి నలుగురు అనుమానాస్పద మృతి
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా హత్య చేసి ఉంటారా, అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి :దుబాయ్లో మనోడికి జాక్పాట్.. లాటరీతో కోట్లు కైవసం
Last Updated : May 21, 2020, 7:42 PM IST