ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బాధితులా.. ఆదుకొనే ఆసుపత్రులివే! - ఐసోలేషన్ కేంద్రాలు

మీరు కరోనా బాధితులా..? ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండేందుకు వీల్లేదా? అత్యవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహాయకులు లేరా? ఇలాంటి వారి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 ఐసోలేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది. బాధితులు త్వరగా కోలుకునేలా చేయడమే వీరి లక్ష్యం.

హైదరాబాద్​లో కొవిడే కేర్ కేంద్రాలు
covid centers in hyderabad

By

Published : May 1, 2021, 12:07 PM IST

కరోనా చికిత్స పొందుతున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఐసోలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. వీరిలో ఎవరికైనా శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తితే తక్షణం గాంధీ ఆసుపత్రికిగానీ, టిమ్స్‌కు గానీ అంబులెన్స్‌లో స్వయంగా తరలిస్తారు. ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్‌ ఆయుర్వేద వైద్యశాల, బేగంపేట్‌లోని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి(ప్రకృతి చికిత్సాలయం), కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి, నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రులలో వీటిని ఏర్పాటు చేశారు.

ఇంట్లో వసతి లేనివారు చేరొచ్చు

* ఎవరికి ప్రాధాన్యం: స్వల్ప కరోనా లక్షణాలున్నవారు. ఇంట్లో ప్రత్యేక గదులు లేనివారు. ● పడకలు: 220 ● నిండినవి: 40

* వైద్యులు, వైద్యసిబ్బంది: ఒక నోడల్‌ అధికారి, 108 మంది పీజీ స్కాలర్లు, 40 మంది బోధన సిబ్బంది.

*ఆహారం: ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం.. రాత్రి భోజనం, రెండు పూటలా ఉడకబెట్టిన గుడ్లు, అవసరమైనవారికి చపాతీలు, ఇతర కాయగూరలు.

- డా.డి.రామచంద్రారెడ్డి, బీఆర్‌కేఆర్‌ ఆయుర్వేద ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌

ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉన్నవారు చేరొచ్చు

* ఎవరికి ప్రాధాన్యం: కొవిడ్‌ లక్షణాలు మధ్యస్థ, తీవ్ర స్థాయిలో ఉన్నవారు:

* పడకలు: 70 ఆక్సిజన్‌, 30 ఐసీయూ. ● నిండినవి: 37

* ఆహారం: ఉదయం కాఫీ/టీ. ఉ.7 గంటలకు అల్పాహారం, ఉ.10, మ.3కి నిమ్మరసం, రెండు పూటలా భోజనం ఉడకబెట్టిన గుడ్లు, మ.3 గంటలకు ఎండు ఫలాలు.

- దశరథ్‌, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, కొండాపూర్‌

బాధితులపై ప్రత్యేక శ్రద్ధ

* ఎవరికి ప్రాధాన్యం: కరోనా పాజిటివ్‌ రిపోర్టు ఉన్నవారిని, ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించి చేర్చుకుంటారు.

* పడకలు: 280 ● నిండినవి: 143

* వైద్యులు, వైద్యసిబ్బంది: వైద్యులు 16 మంది, నర్సులు: 3, సహాయకులు: 28.

* ప్రత్యేకత: రోగులకు ఇచ్చే ఆహారం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ. ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కౌన్సెలింగ్‌.

* ఆహారం: డబ్ల్యూహెచ్‌వో నిబంధనల మేరకు రోజంతా చక్కటి ఆహారంతోపాటు ఉదయాన్నే కషాయం. రోజూ 45 నిమిషాలు ఆరుబయట యోగా. కోలుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అవసరమైనవారికి ప్రత్యేక ఆహారం.

- డా.మాలతీ శ్యామల, సీనియర్‌ మెడికల్‌ అధికారి, నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి

ఇదీ చూడండి:

కరోనా వేళ ఒకే గది ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details