ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పామును ఆసుపత్రికి తీసుకెళ్లారు.. కట్టుకట్టారు..!

Treatment to Cobra: ఏదైనా విషపురుగు కనిపించిందంటేనే ఆమడదూరం పరిగెడుతాం. అందులోనూ నాగుపాము అంటే ఇంకా బెంబేలెత్తిపోయి భయంతో వణికిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా గాయపడిన ఆ విషసర్పానికి వైద్యచికిత్స అందించారు. నాగుపాముకి వైద్యచికిత్స ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే అదేంటో మీరే చూడండి..

Treatment to Cobra
నాగుపాముకి వైద్యచికిత్స

By

Published : Mar 21, 2022, 12:58 PM IST

Treatment to Cobra: చచ్చిన పామును పట్టుకోవాలన్నా.. ముచ్చెమటలు పడతాయి చాలా మందికి. అలాంటిది.. ఓ తాచు పాముకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స అందిద్దామని ఎవరైనా అనుకుంటారా? కానీ.. ఒక వ్యక్తి మాత్రం ఆ పని చేశారు. ఆయనే.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్. ఆదివారం వనపర్తిలో ఆయన ఓ గాయపడిన నాగుపామును పట్టుకుని దానికి చికిత్స చేయించారు.

అసలేం జరిగిందంటే..?

నాగుపాముకి వైద్యచికిత్స
Treatment to Snake: తెలంగాణలోని వనపర్తి కొత్తకోట రోడ్డులోని భగీరథ చౌరస్తాలో ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. మట్టిపెడ్డల కింద దాగున్న నాగుపాముపై మట్టిపెడ్డ పడడంతో దాని నడుము విరిగి అది కదలలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దానిని గమనించిన స్థానికులు వెంటనే కృష్ణసాగర్​కు సమాచారమిచ్చారు. గాయపడిన పామును ఆయన వైద్యుడు శ్రీనివాసరెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు.
నాగుపాము ఎక్స్​రే

అక్కడే పాముకు ఎక్స్​రే తీయగా నడుము వద్ద ఎముకలు విరిగినట్లుగా గుర్తించారు. పశువైద్యాధికారి ఆంజనేయులు సమక్షంలో సర్పానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (సిమెంటుపట్టి) వేసి చికిత్స అందించారు. పాముకు వైద్య చికిత్స అందించిన కృష్ణసాగర్​ను అందరూ అభినందించారు. సర్పాలు కనిపిస్తే తనకు సమాచారమివ్వాలని, చంపవద్దని ఆయన కోరారు. గతంలోనూ ఇలా ఒక పాము కరెంటుతీగలో చిక్కుకుంటే చికిత్స చేయించామని గుర్తుచేశారు.

నాగుపాముకి వైద్యచికిత్స

ఇదీ చదవండి:మొసలిని బంధించిన అటవీ అధికారులు..

ABOUT THE AUTHOR

...view details