ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు.. సుప్రీంకు అమరావతి నిర్మాణ సంస్థ - బకాయిలను ఇప్పించాలన్నా ఫోస్టర్ సంస్ధ

supreme court
supreme court

By

Published : Aug 11, 2022, 12:29 PM IST

Updated : Aug 11, 2022, 2:03 PM IST

12:25 August 11

ఏపీ నుంచి బకాయిలు ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసిన ఫోస్టర్ సంస్థ

Foster company: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్‌ సంస్థ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. ఫోస్టర్ సంస్ష గతంలో పనిచేసింది. రాజధాని నిర్మాణ ప్రణాళిక, భవన ఆకృతులు రూపొందించింది. అయితే.. తమకు రావాల్సిన సొమ్ము మాత్రం చెల్లించలేదని పేర్కొంది. బకాయిలపై A.M.R.D.A.కి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదన్న కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2019 జూన్‌ తర్వాత నుంచి బకాయిలపై పలుమార్లు లేఖలు రాసినట్లు వెల్లడించింది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది. తమకు రావాల్సిన నిధులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని సుప్రీంకోర్టును కోరింది ఫోస్టర్ సంస్థ. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండి: 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ధన్​ఖడ్​

Last Updated : Aug 11, 2022, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details