ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Former IAS Laxminarayana: ఇంకా ఆస్పత్రిలోనే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ

Former IAS Laxminarayana: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంకా హైదరాబాద్‌ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ విచారణకు రావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనే సందిగ్థత ఏర్పడింది. కాసేపట్లో లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించి.. డిశ్చార్జ్​పై నిర్ణయం తీసుకోనున్నారు.

Former IAS Laxminarayana:
Former IAS Laxminarayana:

By

Published : Dec 13, 2021, 11:57 AM IST

Former IAS Laxminarayana: హైదరాబాద్‌ స్టార్ ఆస్పత్రిలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం కారణంగా స్టార్ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈనెల 10న లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది. విచారణ సందర్భంగా ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Former IAS Laxminarayana: ఇవాళ విచారణకు రావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. కాసేపట్లో లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించనున్నారు. లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. డిశ్చార్జ్‌ చేస్తేనే మంగళగిరి సీఐడీ కార్యాలయానికి లక్ష్మీనారాయణ వెళ్లే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. అయితే.. లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేపట్టినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. సీఐడీ అధికారులు.. లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

AP CID Raids: మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సీఐడీ సోదాలు.. 13న విచారణకు రావాలని నోటీసులు

ABOUT THE AUTHOR

...view details