తెలంగాణలో లాక్‌డౌన్ కఠినతరం చేయడంలో పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను అడ్డుకొని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర సేవలందించేవారు, ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ తదితర సిబ్బంది, ఇతర ముఖ్యమైన పనులపై వెళ్లే వారినీ అడ్డుకున్నారు.
ఈ విషయమై ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. అత్యవసరంగా రాకపోకలు సాగించే వారిని అడ్డుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. దీనిపై డీజీపీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూస్తామంటూ హోంమంత్రి మహమూద్ అలీ ట్వీట్ చేశారు.