వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు. చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదపోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్, కేశవాయినగుంట, ఆటోనగర్, యశోదనగర్, సరస్వతీనగర్, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రీనగర్లో 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.
మేం పనులు చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. చూస్తుండగానే సెల్లర్ అంతా నీటితో నిండిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
- ముంపు బాధితుడు
వరదలతో లోతట్టు ప్రాంతాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. బాధితులకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం