హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూకు ఎంత ప్రాముఖ్యత ఉందో... అది గత కొన్ని దశాబ్దాలుగా పలికే ధరను చూస్తేనే తెలుస్తుంది. ఏడాదికేడాది బాలాపూర్ లడ్డూ ధర అమాంతం పెరుగతూ... అందరినీ అశ్చర్యపరుస్తోంది. అలాంటిది... ఈ సారి ఏకంగా రూ.17 లక్షల 60 వేలు పలికింది. కానీ... ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ బస్తీ గణపతి లడ్డూ ఆ రికార్డును బద్దలు కొటింది. ఎవరూ ఊహించని విధంగా రూ.17 లక్షల 75 వేలు పలికి నగరవాసుల్ని ఆశ్చరచకితుల్ని చేసింది. ఈ ఖరీదైన లడ్డూను భాజపా నాయకుడు గోవర్ధన్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది రూ.15.1 లక్షలు పలికిన వినాయక్ నగర్ లడ్డూ... నగరంలో రెండో స్థానంలో నిలిచింది.
బాలాపూర్ రికార్డును.. తుడిచేసిన ఫిలింనగర్!
గణపతి లడ్డూ అంటే గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని బాలాపూరే. ఏటా జరిగే వేలం పాటలో ఆశ్చర్యపోయేంత ధర పలుకుతూ... వినాయకుని ప్రసాదం భక్తుల సొంతమవుతుంటుంది. ఈ సారి... బాలాపూర్ గణనాథుని లడ్డూ ధరను ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ గణేశుడి లడ్డూ ప్రసాదం దాటి పరుగులు పెట్టింది. నగరంలో తనదే అతి ఖరీదైన లడ్డూగా రికార్డు అందుకుంది.
బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!