వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కౌలుచట్టంపై రైతులకు, కౌలురైతులకు వాలంటీర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ సచివాలయాలు వచ్చాక రైతుల పథకాలు స్థిరీకరణ అవుతాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ విత్తనాలను చెక్!
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరిశీలించిన తర్వాతే గ్రామాల్లోకి పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. సరైనవే దుకాణాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోని నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే అమ్మే విధంగా చూడాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు మాత్రమే వాటిని సరఫరా చేయాలన్నారు. దుకాణాల వద్ద రైతులకు అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.