పోలీసుల తీరుకు నిరసనగా.. మందడంలో బంద్ - మందడంలో కొనసాగుతున్న బంద్
పోలీసుల తీరుకు నిరసనగా మందడంలో రైతులు, మహిళలు బంద్ పాటిస్తున్నారు. వర్తక, వాణిజ్యసంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు.. ప్రభుత్వ కార్యాలయాలను గ్రామస్థులు ర్యాలీగా వెళ్లి మూసివేయించారు.
అమరావతి ఆందోళనల్లో భాగంగా.. నిన్న మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరుకు మందడం వాసులు బంద్ తో నిరసన తెలుపుతున్నారు. రైతులు, మహిళలు బంద్ పాటిస్తున్నారు. వర్తక, వాణిజ్యసంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు,.. ప్రభుత్వ కార్యాలయాలను గ్రామస్థులు ర్యాలీగా వెళ్లి మూసివేయించారు. ర్యాలీని సచివాలయం వైపు వెళ్లనీయకుండా పోలీసులు రోడ్డుపై ఇనుప కంచ వేశారు. మహిళలు అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. మిగతా రైతులు మాత్రం తొలిసారి సీడ్ యాక్సెస్ రోడ్డెక్కారు. హైకోర్టు, సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. వైకాపా సర్కార్ బోగస్ కమిటీలతో ప్రజల్ని మభ్యపెడుతోందని రైతులు ఆగ్రహించారు.