రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు, ఆర్థికలోటు పెరిగిపోయాయని మండిపడ్డారు. గత ఏడాది మొత్తం వ్యయం... సవరించిన అంచనాల్లో.... 58 వేల కోట్ల రూపాయలకు తగ్గించారన్న యనమల.... ఇన్ని కోతల మధ్య అన్ని పథకాలు అమలు చేశామని ఈ ప్రభుత్వం ఎలా చెప్పగలదని నిలదీశారు.
అభివృద్ది, సంక్షేమానికి పెట్టిన ఖర్చు అత్యల్పంగా ఉన్నా.... వైకాపా ప్రచారం పిచ్చిమాత్రం ఆకాశాన్నంటిందని యనమల దుయ్యబట్టారు. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు నిష్పత్తి 34 శాతానికి చేరిందనీ... ఇది 2019 - 20లో ఉన్న 28 శాతం కన్నా అత్యధికమని తెలిపారు. ఈ రెండేళ్లలోనే అప్పులు పెరుగుతుంటే.. మూలధన వ్యయం మాత్రం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉందని వెల్లడించారు.