ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Crime News: రమ్మంది.. కలిసుందాం అంటే కాదంది.. ఇంకేముంది అందుకే... - తెలంగాణ తాజా వార్తలు

తన మాజీ ప్రియుడిని సరదాగా కలిసేందుకు ఇంటికి రమ్మంది. ఆ వ్యక్తి 24 గంటల్లో ఆమె ముందు వాలిపోయాడు. ఇద్దరం కలిసుందామని ఆమెని కోరాడు. నిరాకరించింది.. ఇంకేముంది హత్య చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.

lover killed his wife
ప్రియురాలిని చంపిన ప్రియుడు

By

Published : Aug 11, 2021, 3:41 PM IST

ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రియుడు తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో హత్యచేసిన ఘటన మంగళవారం రాత్రి తెలంగాణలోని మేడ్చల్ జిల్లా​ జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన పూజ(21), రాజేశ్‌ వర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొని నగరానికి వచ్చి మేడ్చల్ జిల్లా తెలంగాణలోని జీడిమెట్ల వినాయక్‌నగర్‌లో అద్దెకుంటున్నారు. భర్త స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. మాజీ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ.. సరదాగా ప్రియుడిని చూసేందుకు నగరానికి రావాల్సిందిగా కోరింది. 24 గంటల్లో ఓ స్నేహితుడిని వెంటబెట్టుకొని వచ్చి కలిశాడు. తన వెంట రావాలని.. ఇద్దరం కలిసుందామని కోరాడు. ఆమె నిరాకరించడంతో దిండుతో పూజను ఊపిరాడకుండా చేసి చంపేసి పరారయ్యాడు. హత్యపై భర్త రాజేశ్‌ వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details