ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - తెలుగు న్యూస్

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ న్యూస్

By

Published : Mar 31, 2021, 9:00 AM IST

  • మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!

మూడు రంగులు అద్దుకొని కోట్లాది హృదయాలను ఏకతాటిపైకి తెచ్చిన మన జాతీయ పతాకం బుధవారం నాటికి వంద వసంతాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో సమరయోధుల భుజాలపై నిలిచి భారతీయుల ప్రతాపానికి, దేశభక్తికి ప్రతీకగా వెలుగొందిన మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళి వెంకయ్య. 1921 మార్చి 31న బెజవాడ విక్టోరియా మహల్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో స్వాతంత్య్ర సమరయోధుల సమక్షంలో ఈ పతాకాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి ఆయన అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా ముత్రాసుపల్లిపాలెంలో జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుపతి ఉప ఎన్నిక: నేడు నామినేషన్ల పరిశీలన

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పులివెందులలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

కడపజిల్లా ముద్దనూరులో జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా..ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీడీ కేసు: యువతి వాంగ్మూలం నమోదు

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళి రాసలీలల సీడీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ సీడీలో ఉన్నట్లు భావించిన యువతి.. మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పోలీస్​పైకి కారు- వాహనదారుడి దుస్సాహసం!​

కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లాలోని హట్టికేరీ టోల్​గేట్​ వద్ద ఏఎస్పీ పైకి కారును ఎక్కించేందుకు ప్రయత్నించారు ఓ వాహనదారుడు. టోల్​గేట్​ వద్ద నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించడానికి వెళ్లిన.. ఏఎస్పీపై ఈ దుస్సహసానికి ఒడిగట్డాడు. ఈ ఘటననకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ.27 లక్షల కోట్లకు ఆరోగ్య సంరక్షణ రంగం!

2017- 2022 వరకు ఏడాదికి ఐదు లక్షలకు పైగా.. మొత్తం 27 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉందని తాజా నివేదికలో అభిప్రాయపడింది నీతి ఆయోగ్‌. ఉద్యోగాల కల్పన, ఆదాయ పరంగా దేశంలో అతి పెద్ద రంగాల్లో ఒకటిగా అవతరిస్తోందని తెలిపింది. 2017 నుంచి దాదాపు 22 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ వృద్ధి చెందుతోందని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​లో మానవ హక్కుల సమస్యలు: అమెరికా

భారత్​లో మానవ హక్కుల సమస్యలు చాలా ఉన్నాయని అమెరికా నివేదిక పేర్కొంది. భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మత స్వేచ్ఛలో ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది. అయితే, జమ్ము కశ్మీర్​లో పరిస్థితులు మెరుగుపడ్డాయని నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీమ్​ఇండియాలో 'ఇద్దరు మిత్రులు' కథ!

స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్​ శర్మ మధ్య అంతరాలు తొలగిపోయావని ప్రస్తుతం వారిద్దరూ మంచి మిత్రులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వీరమల్లు' షూటింగ్​లో ఆ నటుడికి గాయాలు!

పవన్​కల్యాణ్​ 'వీరమల్లు' షూటింగ్​లో భాగంగా గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో నటుడు ఆదిత్య మీనన్​ గాయపడ్డారని సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details