- నిమ్మాడలో ఉద్రిక్తత.. అచ్చెన్నాయుడు అరెస్టు
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముగిసిన తొలి దశ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నిలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,249స్థానాలకు 19,491 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 32,504 వార్డు స్థానాలకు గానూ...79,799 నామినేషన్లు వేశారు. మొత్తం దాఖలైన నామపత్రాల్లో 2767 నామినేషన్ల వివిధ కారణాలతో తిరస్కరించారు. వీటిలో సర్పంచ్‌ల నామినేషన్లు 1103 ఉండగా...వార్డు సభ్యులవి 1664 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి తీవ్ర నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్
ప్రత్యేక హోదా ఊసే లేదు.. రైల్వే జోన్ మాటే ఎత్తలేదు...కొత్తగా ఒక్క వరమూ ఇవ్వలేదు. కనీసం విభజన హామీల ప్రస్తావనే లేదు. మోదీ సర్కారు రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపింది. ఆర్థిక పరిపుష్టి కలిగిన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై అపార ప్రేమ కనబరిచిన కేంద్రం...విభజన గాయాలు, ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఏపీపై మాత్రం మరోసారి నిర్లక్ష్యాన్ని కనబరిచింది. భారీ వరాలకు నోచుకోకపోయినా..కనీస విదిలింపులూ లేవు. కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఏపీకి మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా తగ్గిన ఫలితం.. భారీ నష్టం!
పద్నాలుగో ఆర్థిక సంఘంతో పోల్చితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్.. కేంద్ర పన్నుల్లో అయిదేళ్లలో రూ.10,900 కోట్లు నష్టపోనుంది. గత ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 4.305 శాతం వాటా దక్కగా ఈసారి అది 4.047కి పడిపోయింది. 0.258 మేర వెయిటేజీ కోల్పోవడంతో అయిదేళ్ల కాలంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ.10,900 కోట్లు కోతపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పదో తరగతి పరీక్షలకు.. 11 ఏళ్ల బాలుడికి అనుమతి
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడికి.. పదో తరగతి పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతించారు. అతడి ఐక్యూ 16 ఏళ్ల బాలుడికి సమానంగా ఉందని గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆయిల్ ట్యాంకర్లో డ్రగ్స్- 1,200కిలోలు సీజ్