ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను.. రెండుగా చూపటంపై తెలంగాణ అభ్యంతరం - amaravati latest news

KRMB: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్​లో రెండుగా చూపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది.

krmb
krmb

By

Published : Dec 23, 2021, 8:36 PM IST

KRMB: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్​లో రెండుగా చూపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఎస్సెల్బీసీ అంశాన్ని ప్రస్తావించారు. గెజిట్ నోటిఫికేషన్​లో రెండు కాంపోనెంట్లుగా చూపారన్న ఆయన.. 10 టీఎంసీల పనులను అదనంగా చూడరాదని పేర్కొన్నారు.

ఎస్సెల్బీసీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వం ఆయకట్టును మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచిందని.. అయితే నీటి కేటాయింపులు మాత్రం పెంచలేదని లేఖలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయకట్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులను ప్రభుత్వం 30 నుంచి 40 టీఎంసీలకు పెంచిందని వివరించారు. దీంతో పది టీఎంసీలకు సంబంధించిన పనులు అదనపు కాంపోనెంట్ కిందకు రావని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.

75 శాతం నీటి లభ్యత కింద ప్రాజెక్టుకు కేటాయింపుల అంశాన్నికూడా కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ముందు ఉంచినట్లు తెలిపారు. బేసిన్​లోని అవసరాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి ట్రైబ్యునల్ కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు. గెజిట్ నోటిఫికేషన్ లోని ఒకటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న ఎస్సెల్బీసీ రెండో కాంపోనెంట్​ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు కూడా లేఖ ప్రతిని పంపారు.

ఇదీ చదవండి:TDP PRESIDENT CHANDRABABU NAIDU : 'రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలోకి నెట్టారు'

ABOUT THE AUTHOR

...view details