ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం పలు ఆదేశాలిచ్చింది. అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శనలు నిషేధమని తెలిపింది. ఎన్నికల కోడ్‌ను నిష్పక్షపాతంగా అమలుచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వెల్లడించారు.
- ప్రకటనలపై ఫోటోలు, సందేశాలు ప్రదర్శించడం నిషేధం
- అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శనలు నిషేధం
- ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు, సందేశాల ప్రదర్శనకు వీల్లేదు
- ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మంత్రులు, రాజకీయ నేతల చిత్రాలను తొలగించాలి
- ప్రభుత్వ భవనాల్లో ప్రధాని, సీఎం, మంత్రుల చిత్రాలను ప్రదర్శించకూడదు.
కోడ్ వర్తించని అంశం
రాష్ట్రపతి, గవర్నర్, జాతీయ నాయకులు, కవుల చిత్రాలకు కోడ్ వర్తించదు.