ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్లను పరిశీలించిన సంస్థ ఎండీ కిరణ్ - కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్ల వార్తలు

కేరళలోని అలెప్పీలో వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ నిర్మించిన కొత్త ఇళ్లను ఈనాడు ఎండీ కిరణ్ పరిశీలించారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

eenadu-md-kiran-visited-kerala-checked-constructed-houses
eenadu-md-kiran-visited-kerala-checked-constructed-houses

By

Published : Feb 9, 2020, 1:33 PM IST

Updated : Feb 9, 2020, 1:54 PM IST

కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్లను పరిశీలించిన సంస్థ ఎండీ కిరణ్
కేరళ వరదల సమయంలో కకావికలమైన అలెప్పీలో ఈనాడు సహాయనిధి సహాయంతో నిర్మించిన కొత్త ఇళ్లను ఈనాడు ఎండీ కిరణ్ పరిశీలించారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీలతో కలిసి మరియకుళం నార్త్ పంచాయతీలో పర్యటించారు. సర్వం కోల్పోయి... ఇప్పుడు నూతన గృహాలు పొందిన లబ్ధిదారులతో కిరణ్ మాట్లాడారు. 420 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మితమైన నాలుగు గదుల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. భీకర వరదల సమయంలో తమకు జరిగిన నష్టాన్ని ఈనాడు ఎండీకి వివరించిన లబ్ధిదారులు.. దాతృత్వంతో కొత్త ఇళ్లను నిర్మించి ఇచ్చిన రామోజీ గ్రూప్ కి కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో మరిచిపోలేని సాయం చేశారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Last Updated : Feb 9, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details