వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ సిలబస్ మార్చుతున్నట్లు ప్రకటించారు. మాతృభాష వికాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లోని అధ్యాపకులకు వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు 5 నెలల పాటు ఆంగ్ల బోధన కోసం అత్యున్నత సంస్థలతో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
'ఆంగ్ల మాధ్యమం కచ్చితంగా అమలు చేస్తాం'
ప్రభుత్వ పాఠశాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.
education minister adhimulapu suresh clarity on english medium schools