ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ - Note for Vote Case

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

By

Published : May 27, 2021, 2:21 PM IST

Updated : May 27, 2021, 3:46 PM IST

14:18 May 27

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా, మత్తయ్య జరుసలేం, వేం కృష్ణకీర్తన్‌పై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే స్టీఫెన్​సన్​కు లంచం ఇస్తుండగా రేవంత్​ రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.50 లక్షలను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర పన్నినట్లు ఈడీ పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూశారని ఆరోపించింది. ఏసీబీ ఛార్జిషీటు ఆధారంగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఇదీ చదవండీ... ఆనందయ్య మందుపై ఎవరు అనుమతివ్వాలో కేంద్రం తెలపాలి: హైకోర్టు

Last Updated : May 27, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details